బాషా తిరిగొచ్చాడు.. సీఎస్కే ట్వీట్

  • ఐపీఎల్ లో ఈ రోజు చెన్నై, ముంబై మధ్య మ్యాచ్
  • మాణిక్‌ బాషా వేషధారణలో ధోనీ ఫొటో షేర్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 
  • సమఉజ్జీల సమరంలో భావోద్వేగాలు హై లెవెల్ లో ఉంటాయంటూ మరో వీడియో ట్వీట్
ఐపీఎల్ లో ఈ రోజు సమఉజ్జీల మధ్య సమరం జరగనుంది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. మధ్యాహ్నం 3.30 నుంచి చెన్నైలో మ్యాచ్ కొనసాగనుంది.

ఈ నేపథ్యంలో మాణిక్‌ బాషా (బాషా సినిమాలో రజనీకాంత్ పాత్ర) వేషధారణలో ధోనీ ఫొటోను చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసింది. ‘‘మాణిక్యం.. అతడి బాయ్స్‌ తిరిగి ఊరొచ్చారు’’ అని రాసుకొచ్చింది. బాషాగా ధోనీ.. అతడి వెనుక రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, దీపక్ చహర్ ఫొటోలను పోస్ట్ చేసింది.  

తర్వాత మరో వీడియోను కూడా ట్వీట్ చేసింది. సమఉజ్జీల సమరం జరిగేటప్పుడు భావోద్వేగాలు హై లెవెల్ లో ఉంటాయనే అర్థం వచ్చేలా క్యాప్షన్ ఇచ్చింది. ధోనీ ప్రాక్టీస్, సహచరులతో రోహిత్ శర్మ చర్చలు వంటివి వీడియోలో కనిపించాయి.

Chennai Super Kings
Dhoni
basha
Mumbai
IPL 2023
CSK

More Telugu News